ఈ నెలాఖరుతో ఓటాన్ బడ్జెట్ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాలు 10 రోజుల పాటు కొనసాగే అవకాశముంది. పలు బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది.