చేతకాని హోంమంత్రి ఎక్కడ?: వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి

79பார்த்தது
చేతకాని హోంమంత్రి ఎక్కడ?: వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి
ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆరోపించారు. రాష్ట్రంలో ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయని, చేతకాని హోంమంత్రి అనిత ఎక్కడున్నారని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆడపిల్లలపై అరాచకాలు పెరిగాయన్నారు. చిన్నారులు, యువతులు, అత్తాకోడళ్లపై అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. బాధితులకు ధైర్యం చెప్పే బాధ్యత కూడా ప్రభుత్వానికి లేకుండా పోయిందన్నారు. దిశ యాప్‌ను పునరుద్ధరించాలని ఆమె డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி