కొత్తగూడెం: ఈ నెల 6 నుంచి తెలంగాణ ప్రభుత్వం కులగణన చేసేందుకు అన్ని ఏర్పాటు చేస్తుంది. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇందులో అత్యధికంగా స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రైమరీ స్కూల్ టీచర్లు, హెడ్మాస్టర్లు ఉన్నారు. ఈ నెల 6 నుంచి ఈ 3 వారాల పాటు ప్రాథమిక పాఠశాల్లో మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే క్లాసులు నిర్వహిస్తారు. తర్వాత పాఠశాల సిబ్బంది ప్రభుత్వ సర్వేలో పాల్గొంటారు.