కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవల కొరత గత రెండు నెలలుగా కొనసాగుతుంది. రేడియోలజిస్టులు, స్కానింగ్ కి ఏర్పడిన కొరత, స్కానింగ్ తీయించుకోవాలంటే ప్రైవేట్ ఆస్పత్రికి పోవాల్సిన దుస్థితి నెలకొన్నది. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు వస్తే ఇక అంతే సంగతి. ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ప్రాణం దక్కుతుందో లేదో అన్న భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు. ఇప్పటికైనా అధికారులు మేలుకొని స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.