సామాజిక ఆర్థిక సర్వే తీరును భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శుక్రవారం పరిశీలించారు. పాల్వంచ మండలం పూనుకుల గ్రామ పంచాయతీలో జరుగుతున్న సర్వే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ సర్వేకు అన్ని వివరాలు తెలియజేస్తూ సహకరించాలని అన్నారు. సర్వే వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.