నెల్లూరు: రైలు కింద పడి ఆత్మహత్య
గుర్తుతెలియని వ్యక్తి (55) రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన వైనమిది. నెల్లూరు నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీ రైలు పట్టాలపై బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు బ్లూ కలర్ జెర్సీ, ఫ్యాంటు ధరించి ఉన్నాడు. ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.