తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద ముద్దునూరు వద్ద బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంలో వస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న లక్ష్మమ్మ(40) అనే మహిళ పైనుండి పల్టీలు కొడుతూ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లక్ష్మమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.