నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. మాజీ ప్రధానమంత్రి దివంగత మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రభుత్వం సంతాప దినాలుగా ప్రకటించడంతో ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటారు. అలాగే జనవరి ఒకటో తేదీన వేమిరెడ్డి దంపతులు అందుబాటులో ఉండరు.