నెల్లూరు జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వీఆర్ కళాశాలను తిరిగి ప్రారంభిస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. బుధవారం నెల్లూరు నగరంలోని వీఆర్ ఉన్నత పాఠశాలను ఆయన జాయింట్ కలెక్టర్ కార్తీక్, కమిషనర్ సూర్యతేజలతో కలిసి పరిశీలించారు. మార్చి 31లోపల వీఆర్ ఉన్నత పాఠశాలను పునః ప్రారంభించి. అన్నీ తరగతులు ప్రారంభిస్తామన్నారు.