నెల్లూరు: క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్
నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ చేతుల మీదుగా యునైటెడ్ వెల్ఫేర్ GSWS గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వారి వార్షిక క్యాలెండర్ ను శుక్రవారం ఆవిష్కరణ చేశారు. సచివాలయ సిబ్బంది పడుతున్న సమస్యలను కలెక్టరు దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షురాలు గుజ్జల.రాజ్యలక్ష్మి,వైస్ ప్రెసిడెంట్ మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.