విషాదం.. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం (వీడియో)

53பார்த்தது
AP: కాకినాడ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తాళ్ళరేవు మండలం నీలపల్లికి చెందిన కుడుపూడి మల్లిఖార్జున రావు, జార్జిపేటకు చెందిన కాకరపల్లి శ్రీను స్నేహితులు. మల్లిఖార్జునరావుకు శ్రీను కొంత డబ్బు బాకీ ఉన్నాడు. ఆ డబ్బును పలుమార్లు అడిగినప్పటికీ శ్రీను ఇవ్వలేదు. ఇదిలా ఉండగా గురువారం శ్రీను ఇంటి ముందు మల్లిఖార్జునరావు మృతదేహం లభ్యమైంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

தொடர்புடைய செய்தி