నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో పలువురు అధికారులను బదిలీ చేస్తూ కమిషనర్ సూర్య తేజ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హౌసింగ్ విభాగం సూపరింటెండెంట్ సిద్దిక్ ను మేయర్ పేషీకి, ఎస్టాబ్లిష్ మెంట్ విభాగంలో ఉన్న బాలసుబ్రహ్మణ్యంను హౌసింగ్ ఇన్ఛార్జిగా, లీగల్ సెల్ సూపరింటెండెంట్ ప్రవీణ్ ను ఎస్టాబ్లిష్ మెంట్ విభాగానికి బదిలీ చేశారు.