నెల్లూరులోని జిల్లా పంచాయతీ ఆఫీస్ నందు బుధవారం యూడబ్ల్యూజీఈఏ క్యాలెండర్ ను జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం ఆ సంఘం ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు రాజ్యలక్ష్మి, ఉపాధ్యక్షులు మోహన్ కృష్ణ, నెల్లూరు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, సైదా ఆఫీసా, మౌనిక తదితరులు పాల్గొన్నారు.