నెల్లూరు: మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన అబ్దుల్ అజీజ్
నెల్లూరు నగరంలోని విఆర్ జూనియర్ కళాశాల లో డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని నెల్లూరు నగర మున్సిపల్ కమిషనర్ సూర్య తేజ, రాష్ట్ర వక్స్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, కమిషనర్ సూర్య తేజ శనివారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం ప్రారంభించారని దీనిలో భాగంగా నెల్లూరు నగరంలోని విఆర్ మున్సిపల్ కాలేజీలో కూడా ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు.