హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకల్లో కారును ర్యాష్ డ్రైవింగ్ చేసిన జంటకు న్యాయమూర్తి వింత పనిష్మెంట్ ఇచ్చారు. దయా సాయిరాజ్ అతని స్నేహితురాలు మద్యం తాగి కారును వేగంగా నడిపి ప్రమాదానికి కారణమయ్యారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు వారిని కోర్టులో హాజరుపరచగా 15 రోజుల పాటు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఉదయం 10 నుంచి 12 గంటల వరకు రిసెప్షన్‌లో నిలబడి స్టేషన్‌కు వచ్చే వారికి స్వాగతం పలకాలని జడ్జి తీర్పు ఇచ్చారు.