నెల్లూరు: శ్రీ వేణుగోపాల స్వామి అవతారంలో భక్తులకు దర్శనం
నెల్లూరు మూలపేటలో వెలసి ఉన్న శ్రీ సత్యభామ, రుక్మిణి సమేత శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో సోమవారం 6వ రోజు శ్రీ వేణుగోపాల స్వామి అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవాల్లో భాగంగా దేవస్థానంలో విద్యుతాలంకరణ, పూలాలంకరణ శోభాయమానంగా చేశారు.