మాజీమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డితో నెల్లూరు డైకాస్ రోడ్డు క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రస్తుత రాజకీయాలకు సంబంధించి పలు విషయాలను చర్చించారు. త్వరలో తాడేపల్లిలో జరిగే సమావేశంపై సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు సమాచారం.