AP: కాకినాడ సీ పోర్టు లిమిటెడ్, కాకినాడ సెజ్‌లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం ఈడీ విచారణకు హాజరుకానున్నారు. గతంలో ఈ వ్యవహారంపై కర్నాటి వెంకటేశ్వర రావు అనే వ్యక్తి విజయసాయిరెడ్డిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణను బేస్ చేసుకుని రంగంలోకి దిగిన ఈడీ.. తమ దర్యాప్తులో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు గుర్తించారు.