AP: రాజమండ్రిలో శనివారం జరిగిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కొందరు ఆకతాయిలు హల్ చల్ చేశారు. ఈ ఈవెంట్‌లో ప్రజల వీక్షణ కోసం ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్‌ను ధ్వంసం చేశారు. దాంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.