నెల్లూరు రంగనాయకులపేటలోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానంలో ఆదివారం పగల్ పత్తు ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం 6వ ఉత్సవం అయిన విశేష పుష్పాలంకరణ సేవలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ రంగనాథ స్వామి ఆదివారం కనివిందు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహణ అధికారి ఆళ్ల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.