రైతు భరోసా అమలు చేయకుండా సీఎం రేవంత్ ఆ టాపిక్ డైవర్ట్ చేసేందుకే ఏసీబీ డ్రామా చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. అటు తనను ఏసీబీ ఆఫీస్‌కు పిలిచి తన ఇంట్లో రైడ్స్ చేయించేందుకు రేవంత్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కాగా కార్యాలయంలోకి లాయర్లను అనుమతించకపోవడంతో ఇందుకు గల ఆదేశాలు చూపాలంటూ ఆఫీస్ సమీపంలోనే కేటీఆర్ నిలిచి ఉన్నారు. నరేందర్ రెడ్డి ఇవ్వని వాంగ్మూలాన్ని పోలీసులు రాసినట్లు తనకూ జరగొద్దనే తన లాయర్లతో వచ్చానని స్పష్టం చేశారు.