పవర్ యూత్ స్వచ్చంధ సేవ సొసైటీ 5వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా రక్తదాన శిబిరంను నెల్లూరు దర్గామిట్ట ప్రగతి నగర్ మెయిన్ రోడ్డు వద్ద ఆదివారం మెగా స్వచ్ఛంద రక్తదాన శిబిరంను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగర డిఎస్పి శ్రీనివాసులు రెడ్డి హాజరై ప్రారంభించారు. రక్తదాన శిబిరంలో 70 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగింది.