AP: రాష్ట్రంలో తెల్లారే పింఛన్ ఇవ్వాలా అని రాష్ట్ర గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం అంటే ఇదేనా? అని నిలదీశారు. ఇతర గ్రామాలలో ఉన్న మహిళా ఉద్యోగులు పింఛన్లు ఇవ్వడానికి ఎన్ని గంటలకు నిద్ర లేచి రావాలో అధికారులు గమనించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా ఐఆర్, పెండింగ్ డీఏల్లో ఒకటైనా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.