సిపిఎం 27వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఆదివారం నెల్లూరు నగరం 54వ డివిజన్ పరిధిలోని జనార్దన్ రెడ్డి కాలనీ నందు సిపిఎం పార్టీ కార్యకర్తలు ఆదివారం 5 దళాలుగా ఏర్పడి కరపత్రాలు ఇస్తూ ప్రచారం చేశారు. ముందుగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్ జనార్దన్ రెడ్డి కాలనీ మసీదు సెంటర్ వద్ద అన్ని దళ సభ్యులకు రెడ్ టవలు మెడలో వేసి ప్రతి కార్యకర్తకు ఎర్రజెండా చేతికిచ్చి ఈ దళాలను జండా ఊపి ప్రారంభించారు.