టమోటా రైతు పరేషాన్
రాష్ట్రంలో మదనపల్లి టమోటాల తర్వాత గిద్దలూరు ప్రాంతం టమోటాలకు ప్రసిద్ధి. ఇక్కడ టమోటా పంటలు రైతులకు సిరులు కురిపిస్తున్నాయి. ప్రస్తుతం గిద్దలూరు మండలంలోని కొండపేట గ్రామంలో షేక్. వలి అనే టమోటా రైతు పంట వేసి సోమవారం రోజు తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా టమోటా పంట వేస్తున్నానని లాభాలు చాలా బాగున్నాయని ఉద్దేశంతో మరల ఈ సంవత్సరం కూడా అర ఎకరా పొలంలోటమోటా పంట వేశానని కానీ ఎండు తెగుళ్ల వల్ల టమోటా నాశనం అయిందని నాలుగు నెలలు కష్టపడి దాదాపుగా 30 వేల రూపాయలు దాకా అర ఎకరంకి పెట్టుబడి పెట్టిన కూడా పెట్టుబడి రాక తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. దీన్ని మందులు కొట్టిన కూడా ఈ ఎండు తెగుళ్లు వైరస్ ఒక మొక్క నుంచి మరో మొక్కకు సంక్రమణకు చెందడం వలన మొక్క చనిపోయి పంట నాశనం అవుతుందని తన ఆవేదన వ్యక్తం చేశాడు