రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం
ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పెంచికలపాడు గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో.. ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు గాయపడగా నాగిరెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. గాయపడ్డ వారిని వైద్యం కోసం నంద్యాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని బేస్తవారిపేట ఎస్సై రవీంద్ర రెడ్డి బుధవారం తెలిపారు.