నాటు సారా స్థావరాలపై పోలీసుల దాడులు

85பார்த்தது
నాటు సారా స్థావరాలపై పోలీసుల దాడులు
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఆకవీడు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో నాటు సారా స్థావరాలపై ఎస్సై కోటేశ్వరరావు మంగళవారం దాడులు నిర్వహించారు. దాడుల్లో నాటుసారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్న 400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. అలానే రెండు లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకొని ఓ వ్యక్తిని ఎస్ఐ కోటేశ్వరరావు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

தொடர்புடைய செய்தி