యూపీలోని కాన్పూర్లో మంగళవారం విషాద ఘటన జరిగింది. బర్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్డుపై మూడేళ్ల బాలిక ఆడుకుంటోంది. ఆ సమయంలో చిన్నారిని కారు డ్రైవర్ గమనించలేదు. ఇరుకైన సందులో కారును డ్రైవర్ ముందుకు పోనిచ్చాడు. దీంతో కారు చక్రాల కింద నలిగి మూడేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. సీసీటీవీ ఫుటేజీ సాయంతో కారు డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది.