పౌష్టికాహార కిట్స్ పంపిణీ

78பார்த்தது
పౌష్టికాహార కిట్స్ పంపిణీ
పౌష్టికాహార మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా.. గిద్దలూరు పట్టణ కోట గడ్డ ఆరోగ్య కేంద్రంలో బుధవారం వైద్యాధికారి షరీఫ్ గర్భవతులకు, బాలింతలకు తగిన సూచనలు సలహాలు ఇచ్చి, పౌష్టికాహార కిట్స్ పంపిణీ చేసారు. ప్రతి ఒక్కరు అంగన్వాడి కేంద్రంలో ఇచ్చే పౌష్టికాహారం తప్పనిసరిగా వాడుకోవాలన్నారు. నెలనెలా హాస్పిటల్ కి వచ్చి చెకప్ చెపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సుధారాణి, ఎఎన్ఎం, ఆశా కార్యకర్తలు, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி