ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్ల తొలగింపు ప్రక్రియను మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షించారు. విశాఖ నుంచి వచ్చిన బృందం బోట్ల కటింగ్ ప్రక్రియ ప్రారంభించింది.. వీటిని కట్ చేసి ఎయిర్ బెలూన్ టెక్నాలజీ ద్వారా పైకి తీయనున్నారని మంత్రి తెలిపారు. ఈ బోట్లను బ్యారేజీని కూల్చే కుట్రతోనే పంపారని తేలిందన్నారు. పడవలు సెంటర్ పిల్లర్‌ను ఢీకొని ఉంటే ప్రకాశం బ్యారేజీ ఉండేది కాదని, ఈ మొత్తం కూడా బంగాళాఖాతంలో కలిసిపోయి ఉండేదని మంత్రి అన్నారు.