గ్రంథాలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మంత్రి పెమ్మసాని
గుంటూరు ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఆదివారం గుంటూరు ప్రాంతీయ గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే నజీర్ తో కలిసి ఆయన సందర్శించారు. శిథిలావస్థలో ఉన్న గ్రంథాలయం అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. దీనిపై స్పందించిన పెమ్మసాని త్వరలోనే ప్రపోజల్స్ పంపి గ్రంథాలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.