తెలంగాణ విద్యార్థి హత్య కేసు.. అమెరికా వ్యక్తికి 60 ఏళ్ల జైలుశిక్ష

56பார்த்தது
తెలంగాణ విద్యార్థి హత్య కేసు.. అమెరికా వ్యక్తికి 60 ఏళ్ల జైలుశిక్ష
తెలంగాణ విద్యార్థి హత్య కేసులో అమెరికాలోని ఇండియానా కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. అమెరికా దేశస్థుడైన 25 ఏళ్ల నిందితుడు జోర్డాన్ ఆండ్రేడ్‌కు 60 సంవత్సరాల శిక్ష విధించింది. 2023 అక్టోబర్‌లో తెలంగాణకు చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థి వరుణ్ రాజ్ పుచ్చా వాల్పరైసోలోని ప్లానెట్ ఫిట్‌నెస్ జిమ్‌లో హత్యకు గురయ్యాడు. కత్తితో దారుణంగా పొడిచి హత్య చేశాడు.

தொடர்புடைய செய்தி