మన బిజీ జీవితంలో వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటారని, లేకుంటే అనారోగ్య పాలవుతారని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు పోస్టల్ ఆధ్వర్యంలో ఆదివారం ఇండియా పోస్టల్ 5కే రన్ 2024 పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ తాను ఎంత బిజీగా ఉన్నా పొద్దున్నే వ్యాయామం చేస్తానని, ఇలా చేయడం వల్లే బ్రెయిన్ షార్ప్, బాడీ ఫిట్నెస్ ఉంటుందని చెప్పారు.