ప్రకాశం: ఉత్కంఠ రేపుతున్న నూతన మద్యం పాలసీ
రాష్ట్రంలో మద్యం దుకాణాలకు ఈ నెల 11తో దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. ఇందులో ప్రకాశం జిల్లాలో మొత్తం 171 మద్యం షాపులకు గాను 3416 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈనెల 14న ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఆవరణలో కలెక్టర్ తమీమ్ అన్సారియా సమక్షంలో మద్యం దుకాణాలకు సంబంధించి లాటరీ తీయనున్నారు. 16వ తేదీ నుంచి నూతన మద్యం విధానం అమలులోకి వస్తుంది. మొదటి రోజే మొదటి విడత లైసెన్స్ ఫీజు చెల్లించాలని నిబంధనలో ఉంది.