ఒంగోలు: పవన్ కళ్యాణ్ ను కలిసిన బాలినేని
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి బుధవారం సాయంత్రం డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో బాలినేని, పవన్ తో భేటీ అయ్యారు. వివిధ రాజకీయ అంశాలపై చర్చించినట్లుగా తెలిసింది. వీళ్ళిద్దరి భేటి ప్రకాశం జిల్లాలోని రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నది.