మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున కలిసి దసరా వేడుకలు చేసుకున్నారు. కేరళ రాష్ట్రం త్రిశూర్‌లోని కళ్యాణ్ జ్యువెలరీ అధినేత టి.ఎస్. కళ్యాణ్ రామన్ ఇంట జరిగిన నవరాత్రి వేడుకలకు ఇద్దరూ కలిసి వెళ్లారు. ఇద్దరూ విమానాశ్రయంలో కలిసి బయలుదేరిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.