ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌లో శుక్రవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పార్క్ చేసిన బైక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బైకు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా బైకులో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. స్థానికులు మంటలను ఆర్పడానికి ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.