రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాల దరఖాస్తుల గడువును ఈనెల 11వ తేదీ వరకు పొడిగించినట్లుగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఒంగోలులోని కలెక్టరేట్ లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇప్పటివరకు 171 షాపులకు గాను 1, 672 దరఖాస్తులు అందినట్లుగా తెలిపారు. జిల్లాలో మరో 15 షాపులను కల్లు గీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు.