హనుమకొండ వడ్డేపల్లి సమీపంలో ఇంతకు ముందు వరకు కొనసాగిన ఐనవోలు మండల పరిషత్ కార్యాలయ భవనాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య శనివారం పరిశీలించారు. సి. ఇ. కార్యాలయం కోసం ఈ భవనాన్ని కేటాయించేందుకు ఉన్న అవకాశాలను కలెక్టర్ పరిశీలించారు. కార్యాలయం గురించిన వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జడ్పీ డిప్యూటీ సీఈవో రవి, ఇన్చార్జి ఎస్ఈ శంకరయ్య, ఐనవోలు ఎంపీడీవో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.