మద్యం అమ్ముతున్న మహిళల అరెస్ట్

73பார்த்தது
మద్యం అమ్ముతున్న మహిళల అరెస్ట్
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో వరంగల్ ఇంతేజర్ గంజ్ ఎస్సై వెంకన్న ఇతర సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ చేస్తుండగా ఇద్దరు మహిళలు మద్యం బాటిళ్లను విక్రయిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు ఆదివారం కాశిబుగ్గకు చెందిన అంగిడి కరుణ, తేజావత్ శారద లను అదుపులోకి తీసుకున్నారు. 236 బీర్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ. శివకుమార్ తెలిపారు.

தொடர்புடைய செய்தி