చిల్పూర్ మండలం రాజవరం గ్రామంలో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్నీ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి శనివారం ప్రారంభించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే సూచించారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో వరి ధాన్యం తర్వాత అత్యధికంగా పండించే పంట పత్తి అని అన్నారు.