ములుగు జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ప్రారంభం

572பார்த்தது
ములుగు జిల్లాలో శుక్రవారం నుండి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2: 30 నుండి సాయంత్రం 5: 30 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా జిల్లాలో మొదటి సంవత్సరంలో 782, ద్వితీయ సంవత్సరంలో 255 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. జిల్లాల మొత్తం 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி