

ములుగు: లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని ఆందోళన
ములుగు మండలం జంగాలపల్లిలో బుధవారం జరిగిన గ్రామ సభ రాసాభాసగా మారింది. అర్హులు కాకుండా అనర్హులను లబ్దిదారులుగా చేర్చారంటూ అధికారులను గ్రామస్తులు నిలదీశారు. అధికారులు సమగ్ర విచారణ జరిపి సరియైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారుల ఎంపికలో అనర్హులను ఎంపిక చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.