ములుగు జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ సంస్థాగత బలోపేతానికి కృషి చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ములుగు మాజీ జడ్పీ ఛైర్పర్సన్ బడే నాగజ్యోతి, ఇతర నేతలు శుక్రవారం మాజీ మంత్రిని కలిశారు. జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వివరించి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ మంత్రి సూచించారు.