అమ్మ ఆదర్శ పాఠశాల పనుల్లో నాణ్యత పాటించాలి: అదనపు కలెక్టర్

72பார்த்தது
అమ్మ ఆదర్శ పాఠశాల పనుల్లో నాణ్యత పాటించాలి: అదనపు కలెక్టర్
అమ్మ ఆదర్శ పాఠశాల పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ములుగు అదనపు కలెక్టర్ శ్రీజ అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఆదర్శ పాఠశాల పనులపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ. పాఠశాల అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని, పనుల్లో వేగం పెంచాలని అన్నారు. నిర్దేశిత గడువులోపు పనులు పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా పాఠశాలల్లో యూనిఫాం దుస్తులు గడువులోపు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி