గ్రామానికి కీడు

70பார்த்தது
మహబూబాబాద్ జిల్లా నడివాడ గ్రామం పూర్తిగా వ్యవసాయ ఆధారిత గ్రామం. ఈ గ్రామంలో ఇటీవల కాలంలో వరుస మరణాలు రహదారి ప్రమాదాలు సంభవించాయి. గ్రామానికి కీడు సోకిందని అంటూ గురువారం గ్రామస్తులంతా సూర్యోదయానికి ముందే  వనభోజనాలకు తరలివెళ్లారు. గ్రామంలో ప్రజలు ఆయురారోగ్యాలతో జీవించి పాడి పంటలు సంవృద్ధి గా పండాలని  ప్రకృతి దేవతలకు పూజలు నిర్వహించారు. వన భోజనాలకు వెళ్లి రావడం వల్ల గ్రామానికి పట్టిన కీడు తొలగిపోతుందని గ్రామస్తుల ప్రగాఢ విశ్వాసం.

தொடர்புடைய செய்தி