

తొర్రూరు: భూతగాదా నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
మహాబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలో మంగళవారం రాత్రి భూతగాదా ల పై రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. భూమి తగాదా విషయంలో పట్టణంలోని అన్నారం రోడ్డులో మహిళల తో పాటు ఇరువర్గాలు దాడి చేశారు. వీరంతా అమ్మాపురం గ్రామ సమీపంలోని జీకే తండా కు చెందిన వారిగా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.