సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శివరాజ్ మృతి

1571பார்த்தது
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శివరాజ్ మృతి
జనగాం జిల్లా జఫర్ గఢ్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సంగా శివరాజ్ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందిన శివరాజ్ జఫర్ గఢ్ గ్రామపంచాయతీకి నాలుగు టర్మ్ లుగా వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారు. శివరాజ్ ఆకస్మిక మృతితో వారి కుటుంబంలో జఫర్ గఢ్ మండల కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

தொடர்புடைய செய்தி