
జగిత్యాల: స్వస్థలం చేరిన మృతదేహం
జగిత్యాల జిల్లా కేంద్రంలోని సుతారి పేటకు చెందిన ముక్తార్ మోహియోద్దీన్ (27) అనే యువకుడు బ్రతుకుతెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. దుబాయిలో కంపెనీలో గత శుక్రవారం పనిచేస్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు. మృతదేహం బుధవారం స్వ స్థలానికి చేరుకోగా కుటుంబ సభ్యులు అంత్య క్రియలు నిర్వహించారు.