ధర్మారం నిత్యం వందల సంఖ్యలో వాహనదారులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. జగిత్యాల శివారులోని బైపాస్ రోడ్ కూడలిలో రోడ్డుపై గుంతలు వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారాయి. ఇక్కడ గతంలో పలుమార్లు ద్విచక్ర వాహనదారులు, ఈ గుంతల్లో పడి గాయాలపాలయ్యారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, రోడ్డుకు మరమ్మతులు చేయాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.